ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థి..

0
7
ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థి..

పంజాబ్‌:(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలుకు ఫోరం మొట్టికాయలు
  • అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూల్లో నాసిరకం విద్యపై విస్మయం
  • విద్యార్థికి అనుకూలంగా ఆదేశాలు

                       వివరాల్లోకి వెళితే…తీసుకున్న స్కూలు ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి వెనక్కి ఇచ్చేయాల్సిందిగా పంజాబ్‌లోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఓ సాధారణ విద్యాసంస్థలో చేరేందుకు రాసిన ప్రవేశపరీక్షలో తమ కుమారుడు ఫెయిలవడంతో విద్యార్థి తల్లి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తన కుమారుడు చదువుకున్న కేంబ్రిడ్జి స్కూలులో సరైన విద్య అందకపోవడం వల్లే అతడు ఫెయిలయ్యాడని ఆరోపిస్తూ బాలుడి తల్లి ప్రియాంక ఈ ఏడాది ఏప్రిల్ 19న ఫిర్యాదు చేసింది. స్కూలు ఫీజు కింద  రూ.1.75 లక్షలు చెల్లించానని తెలిపింది. ఇంటర్నేషనల్ స్కూలు అన్న కారణంతోనే చదివించానని పేర్కొంది. ప్రోగ్రెస్ కార్డులో మంచి మార్కులే వేసేవారని, కానీ వేరే స్కూల్లో తన కుమారుడిని చేర్చాలనుకున్నప్పుడు స్కూలు బండారం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేసింది.