వెరైటీగా ‘సాహో’ బ్యూటీ ఎవెలిన్‌ నిశ్చితార్థం!

0
7
వెరైటీగా ‘సాహో’ బ్యూటీ ఎవెలిన్‌ నిశ్చితార్థం!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • ఆస్ట్రేలియా డెంటల్ సర్జన్ తుషన్ తో చాలాకాలంగా డేటింగ్
  • సిడ్నీలో నిశ్చితార్థం
  • వెల్లడించిన ఎవెలిన్ శర్మ

ప్రభాస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సాహో’లో తన అందచందాలతో ఆకట్టుకున్న జర్మన్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ నిశ్చితార్థం వేడుకగా సాగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌ సర్జన్‌ తుషన్ బైనాండితో చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న ఎవెలిన్, తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. సిడ్నీలోని ప్రఖ్యాత హార్బర్‌ బ్రిడ్జి బ్యాక్‌ డ్రాప్‌ లో కాబోయే భర్త తుషన్‌ కు లిప్ కిస్ ఇస్తూ, రొమాంటిక్‌ గా దిగిన ఫొటోను ఆమె అభిమానులతో పంచుకుంది. ఎవెలిన్‌ ఎంగేజ్‌ మెంట్‌ జరిగిందని తెలుసుకున్న పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, జర్మనీలో పుట్టిన ఎవెలిన్, అక్కడే పెరిగింది. ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ ద్వారా బాలీవుడ్‌ కు, ఆపై ‘సాహో’ ద్వారా తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది.