ఎమ్మెల్సీ రామారావుకు సత్కారం…

0
9
ఎమ్మెల్సీ రామారావుకు సత్కారం…
వన్‌టౌన్, విశాఖ న్యూస్‌టుడే:
  • ఎమ్మెల్సిగా ఎన్నికైన రామరావును అభినందిస్తు తెదేపా యువ నాయకులు శ్రీబరత్, బీసీ సంఘాల నాయకులు…
  • ఈ సందర్భంగా తెదేపా బీసీ వర్గాలకు చెందిన వారంతా రామారావును శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు…
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన దువ్వారపు రామారావును పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రామారావు ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత తొలిసారి బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తెదేపా బీసీ వర్గాలకు చెందిన వారంతా రామారావును శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెదేపా నాయకుడు ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడంతో పాటు వారికి రాజకీయ అవకాశాలు కల్పించిన ఏకైక పార్టీ తెదేపా మాత్రమేనన్నారు. దువ్వారపు రామారావు మాట్లాడుతూ తెదేపాలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందనడానికి తనకు ఎమ్మెల్సీ పదవి దక్కడమే ఉదాహరణ అన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
                                                                                                                    డెస్క్:లక్ష్మీ