ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను వివరించండి……..

0
5
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను వివరించండి……..

నారాయణపేట న్యూస్‌టుడే:

1) కేరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
2) కార్యాలయ పాలన అధికారి శంకర్‌.
3)ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు.

 విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను తెలియజేయాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని పుర మందిరంలో బుధవారం నిర్మాణ్‌ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన కేరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. విద్యార్థులకు పుస్తకాలు అందే విధంగా చూడాలని సూచించారు. గతేడాది పుస్తకాలు ఇవ్వడం కారణంగా మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఉన్నత విద్య చదివితే వచ్చే ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు వివరించాలని చెప్పారు. చాలా మంది విద్యార్థులకు ఇవి తెలియకపోవడం కారణంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం లేదని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామని అన్నారు. సాఫీగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ పాలన అధికారి శంకర్‌, నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి చంద్రశేఖర్‌, కన్సల్టెంట్‌ హర్షవర్ధన్‌, ఆర్‌ఎంఎస్‌ఏ విభాగ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

                                                                                                       డెస్క్:గౌస్&  లక్ష్మణ్