శాస్త్రవేత్తలు ఉన్న పడవలో మంటలు….

0
10
శాస్త్రవేత్తలు ఉన్న పడవలో మంటలు….
ఢిల్లీ న్యూస్‌టుడే:
*భూవిఙ్ఞాన శాఖ శాస్త్రవేత్తల పడవలో అగ్నిప్రమాదం
*పడవలో ఉన్నవారందరూ సురక్షితం.
కర్ణాటకలోని న్యూ మంగళూరు తీరంలో పరిశోధనలు నిర్వహించే ఓ ఓడలో అగ్ని ప్రమాదం సంభవించగా అందులోని 30 మంది సిబ్బంది,16 మంది శాస్త్రవేత్తలు సురక్షితంగా బయటపడ్డారు.వివరాలు….భూవిఙ్ఞాన శాఖకు చెందిన రీసెర్చ్ వెజిల్ సాగర్ సంపదలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నించినప్పటికీ అవి ఫలించలేదు.దీంతో ముంబయిలోని మెరైన్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు సమాచారమిచ్చారు. తీర ప్రాంత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఐసీజీఎస్‌ విక్రమ్‌, ఐసీజీఎస్‌ సుజయ్‌ను ఘటనాస్థలానికి పంపించారు. దాదాపు 8 గంటలకు పైగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.ఘటన సమయంలో ఓడలో 30 మంది సిబ్బంది, 16 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.ఈ ఓడను న్యూ మగళూరు హార్బర్‌కు తీసుకొచ్చారు.
                                                                                            డెస్క్-విజయలక్ష్మీ