“పవిత్ర బైబిలు” అనే పదం ఎక్కడినుండి వచ్చింది?

0
5
“పవిత్ర బైబిలు” అనే పదం ఎక్కడినుండి వచ్చింది?

శతాబ్దాలపాటు ప్రేరేపిత లేఖనాలు అన్నిటినీ కలిపి, “పవిత్ర బైబిలు” లేదా “పరిశుద్ధ లేఖనాలు” అని పిలిచారు. ఎందుకంటే:
దాని మూలం. “పవిత్రశక్తి ప్రేరణతో మనుషులు దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.”—2 పేతురు 1:21.
అందులో ఉన్న సందేశం. “యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది కంటికి వెలుగునిస్తుంది. యెహోవా గురించిన భయం పవిత్రమైనది, అది ఎప్పటికీ నిలిచివుంటుంది.”—కీర్తన 19:8, 9.
కాబట్టి బైబిలు పవిత్రమైనది. దానిలో ఉన్న స్వచ్ఛమైన సమాచారం, ఆరాధనలో పరిశుద్ధంగా ఉపయోగించబడే తీరు దాన్ని ఇతర పుస్తకాల నుండి వేరు చేస్తుంది.