ఎన్నికల నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన అవసరం…..

0
8
ఎన్నికల నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన అవసరం…..
శ్రీకాకుళం:న్యూస్‌టుడే:
1) ఎన్నికల నిబంధనల్లో సమయపాలన……
2)ఆన్‌లైన్‌ దరఖాస్తులను కూడా స్వీకరించాలి….
3) ప్రచార హోర్డింగ్‌లు, ప్వీప్‌ కార్యక్రమాలు పరిశీలించాలి….
 ఎన్నికల నియమావళిపై రిటర్నింగ్‌ అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని బుధవారం రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను కూడా స్వీకరించాలన్నారు. అభ్యర్థులతో పాటు నామినేషన్‌ వేయడానికి నలుగురిని మాత్రమే అనుమతించాలన్నారు. నామినేషన్‌ తీసుకునే గదిలో తప్పనిసరిగా గడియారం ఉండాలని, ఫారం-ఏ, బీలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. సెక్షన్లను కూడా క్షుణ్నంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రచార హోర్డింగ్‌లు, ప్వీప్‌ కార్యక్రమాలను కూడా పరిశీలించాలన్నారు. సీవిజిల్‌, సువిధ తదితర నివేదికలను కూడా పరిశీలించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
                                                                                                       డెస్క్:గౌస్& లక్ష్మణ్