గాయని చిన్మయి శ్రీపాదకు మద్దతుగా నిలిచిన హీరోయిన్ సమంత…….

0
2
గాయని చిన్మయి శ్రీపాదకు మద్దతుగా నిలిచిన హీరోయిన్ సమంత…….

(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…  

  • వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి
  • చిన్మయి ఎలాంటి తప్పు చేయలేదు
  • ఆమెలా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి

                             వివరాల్లోకి వెళితే….ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు ఆమె స్నేహితురాలు, హీరోయిన్ సమంత మరోసారి మద్దతుగా నిలిచింది. ప్రముఖ సినీరచయిత వైరముత్తు లైంగిక వేధింపుల వ్యవహారంలో గొంతు విప్పడంతో చిన్మయికి ఆఫర్లు తగ్గిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గొడవపై సమంత స్పందిస్తూ..‘మీటూ’ ఉద్యమం విదేశాల్లో ప్రారంభమైంది. అక్కడ మహిళలు ఒకరికొకరు అండగా ఉన్నారు. ఇలాంటి నిజాలు బయటపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇప్పుడు చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. 
ఎటువంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు. ఆమెకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా. ఇప్పటికీ తమిళనాడు డబ్బింగ్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. నేను, నందిని రెడ్డి కలిసి చిన్మయితో ‘ఓ బేబీ’ తమిళ్‌ డబ్బింగ్‌ చెప్పించాం’ అని తెలిపింది. వైరముత్తపై ఆరోపణల నేపథ్యంలో డబ్బింగ్ యూనియన్ లో చిన్మయి సభ్యత్వాన్ని రద్దుచేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా, సభ్యత్వరద్దుపై  హైకోర్టు స్టే విధించింది.