గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ కూడా సినీ రంగంలోకే…!

0
1
గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ కూడా సినీ రంగంలోకే…!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • సినిమా అంటే ఇష్టమని చెప్పిన సిద్ధార్థ
  • బయటి సంస్థలో చేస్తానని చెప్పిన గల్లా వారసుడు
  • ప్రేమకథకే తన ఓటు అని వెల్లడి

ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తన పెద్ద కుమారుడు అశోక్ గల్లాను చిత్ర రంగానికి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ముహూర్తపు కార్యక్రమం జరిగింది. అయితే, గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ కూడా త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధార్థే స్వయంగా వెల్లడించాడు. తన సోదరుడిలా సొంత సంస్థలో కాకుండా బయటి సంస్థ నిర్మించే చిత్రంతో అరంగేట్రం చేస్తున్నానని తెలిపాడు. ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు. తమకు బాల్యం నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం అని, అందుకే సినిమాను కెరీర్ గా ఎంచుకున్నామని వివరించాడు.