టీమిండియా, బంగ్లాదేశ్ జట్లకు ధన్యవాదాలు తెలిపిన గంగూలీ…….

0
1
టీమిండియా, బంగ్లాదేశ్ జట్లకు ధన్యవాదాలు తెలిపిన గంగూలీ…….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • విపరీతమైన వాయు కాలుష్యంలో ఢిల్లీ
  • క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ ఆడిన ఇండియా, బంగ్లాదేశ్
  • క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారంటూ కితాబిచ్చిన గంగూలీ

వివరీతమైన వాయు కాలుష్యం కారణంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢిల్లీలో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ ముగిసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ, ఇరు జట్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మ్యాచ్ ఆడి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారంటూ ఇరు జట్ల ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ‘వెల్ డన్ బంగ్లాదేశ్’ అంటూ కితాబిచ్చారు.నిన్నటి మ్యాచ్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.