యువతుల కడుపులో బంగారం… విమానాశ్రయం పోలీసులు పట్టుకుంటే, కిడ్నాప్ చేసిన గోల్డ్ స్మగ్లర్స్!

0
0
యువతుల కడుపులో బంగారం… విమానాశ్రయం పోలీసులు పట్టుకుంటే, కిడ్నాప్ చేసిన గోల్డ్ స్మగ్లర్స్!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • బంగారం దాచుకుని వచ్చిన ఫాతిమా, త్రిష
  • గుర్తించిన కస్టమ్స్ అధికారులు
  • ఆసుపత్రికి తీసుకు వెళుతుంటే కిడ్నాప్
  • ఎనిమా చేయించి, బంగారం తీసుకెళ్లిన స్మగ్లర్లు

చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు యువతుల కడుపులో బంగారం ఉందని తేల్చిన కస్టమ్స్ అధికారులు, వారిని ఆసుపత్రికి తీసుకెళుతుంటే, అధికారులను ఛేజ్ చేసిన గోల్డ్ మాఫియా వారిని కిడ్నాప్ చేసింది. ఆపై ఆ బంగారాన్ని తీసుకుని పారిపోయింది. యాక్షన్ సినిమాను మరపించే రీతిలో జరిగిన ఈ ఘటనలో గోల్డ్ స్మగ్లింగ్, కిడ్నాప్, నరాలు తెగే ఉత్కంఠత, ఛేజింగ్ లు ఎన్నో ఉన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే…మంగళవారం నాడు శ్రీలంక నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు ఓ విమానం వచ్చింది. ప్రయాణికుల్లో గర్భం దాల్చినట్టుగా కనిపిస్తున్న శ్రీలంకకు చెందిన ఫాతిమా (32), త్రిష (36) ఉన్నారు. వీరిద్దరి తీరూ అనుమానాస్పదంగా కనిపించడంతో, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, వీరి కడుపులో 3 కిలోలకు పైగా బంగారం ఉన్నట్టు తేలింది. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు బయలుదేరగా, పల్లవరం రహదారిలో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా వెంబడించింది. దాదాపు 10 మంది బృందం వీరిని అటకాయించి, ఆ మహిళలను కిడ్నాప్ చేసింది.