గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవం….

0
10
గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవం….
హైదరాబాద్ న్యూస్‌టూడే:
  • రాజధాని ఎక్స్‌ప్రెస్‌’ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవం….
  • విధులు నిర్వర్తించిన సిబ్బంది ప్రత్యేక యూనిఫారమ్‌లు ధరించారు…
అత్యంత వేగంతోపాటు విలాసవంతమైన ప్రయాణంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకుని భారతీయ రైల్వే దశ,దిశను మార్చేసిన రాజాధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల తన 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుంది.1960 సంవత్సరంలో తొలిసారిగా పట్టాలెక్కిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ నెల 3న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాని ఘనంగా జరుపుకొంది. ఉత్సవం జరుపుకొన్న సందర్భంగా ఈ నెల 3న రైలులో వివిధ మార్గాలకు వెళ్లిన ప్రయాణికులకు  ఇండియాన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్  ప్రత్యేక వంటకాలు తయారుచేసి అందించింది.ఇదిలా ఉండగా ,గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని పురస్కరించుకుని రైలులో విధులు నిర్వర్తించిన సిబ్బంది ప్రత్యేక యూనిఫారమ్‌లు ధరించారు.
                                                                                                  డెస్క్: కీర్తి