గుడ్ లక్ టీమ్…

0
9
గుడ్ లక్ టీమ్…
దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా   ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం టైటిల్ పై ఇంతవరకూ ఏ విధమైన వివరాలూ బయటకు రాలేదన్న విషయం తెలిసిందే. ఇక సినిమా  విశేషాలను, మరికొన్ని అంశాలను ప్రేక్షకులకు చెప్పేందుకు రాజమౌళి టీమ్ గురువారం 11.30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లడానికి రామ్ చరణ్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వేళ, వెనుకనుంచి ఫోటో తీసిన ఉపాసన, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గుడ్ లక్ టీమ్ అంటూ అభినందనలు తెలిపారు. ఉపాసన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
                                                                                                                   డెస్క్:జ్యోతి