ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక వరద సాయం ప్రకటించిన జగన్ ప్రభుత్వం!

0
3
ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక వరద సాయం ప్రకటించిన జగన్ ప్రభుత్వం!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు రూ.10 కోట్ల కేటాయింపు
  • వరదలో దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు రూ.5 వేలు
  • ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ఆర్థిక శాఖ

                                         వివరాల్లోకి వెళితే…ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గోదావరి జిల్లాలకు రూ.10.9 కోట్ల ప్రత్యేక సాయాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.5,000 అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నిధుల్లో  ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా, మరో రూ.  2,87,45,000ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను సంబంధిత లబ్ధిదారులకు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.