ద్రాక్ష హల్వా….

0
4
ద్రాక్ష హల్వా….

కావాల్సిన పదార్ధాలు:- 

  • నల్లద్రాక్షలు : వంద గ్రాములు
  • మైదా : పావుకేజీ
  • పంచదార : పావుకేజీ
  • జీడిపప్పుల ముక్కలు : 1 టేబుల్ స్పూన్
  • బాదం పప్పుల ముక్కలు : 1 టేబుల్ స్పూన్

తయారు చేయు విధానం:-
 ఈ హల్వా తయారీకి మంచి మైదా పిండిని తీసుకోవాలి. మైదాలో నీటిని కలిపి ముద్దలా కలపాలి. ఇలా కలుపుకున్న ముద్దలో మూడు కప్పుల నీళ్లు పోసి పూర్తిగా కరిగేలా చేసుకోవాలి. 
 అరగంటకి కలిపిన మైదాలో నీళ్ళు  పైకి తేరుకుంటాయి.తేరుకున్న నీరు తీసేస్తే, అడుగున మైదా పాలు వుంటాయి. ఇవి యించుమించు రెండు కప్పులు పాలు వుంటాయి.
 మార్కెట్ నుండి మంచి ద్రాక్ష పళ్లు తీసుకురావాలి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ లా చేసి ఉంచుకోవాలి. 
 బాణిలి తీసుకుని దానిలో చక్కెర పాకం తయారుచేసుకోవాలి. 
 తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతుండాలి. 
 ఇది గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలాఅయి బాండి అంచులు విడుతుంది. అంటే హల్వా తయార్ అయ్యినట్టే.