గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది……

0
3
గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది……

హైదరాబాద్ : మ‌హా న‌గ‌ర శిఖ‌లో మ‌రో మ‌ణి హారం చేరింది. పాల‌నా ప‌రంగా మౌళిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌, ప్ర‌భుత్వ రంగ సేవ‌ల్లో నాణ్య‌త‌, న‌గ‌ర పాల‌న‌, మున్సిప‌ల్ వ్య‌వ‌స్థ, నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్యం, ర‌వాణా వ్య‌వ‌స్థ, కాలూష్య నిర్మూల‌న‌ త‌దిత‌ర రంగాల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ దూసుకెళ్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న జ‌నాబాని ద్రుష్టిలో పెట్టుకుని అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో న‌గ‌ర‌పాల‌క సంస్థ త‌న‌దైన ముద్ర వేసుకుంటోంది. ఇదే ప‌రంప‌ర‌లో న‌గ‌రానికి స‌ముచిత స్థానం కూడా ల‌భిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది. హైదరాబాద్ నగరానికి ‘స్వచ్ఛత ఎక్సలెన్సీ’ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాలలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. భాగ్యనగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే నగరానికి రెండు అవార్డులు రావడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే నగరానికి ఓడిఎఫ్‌ ప్లస్‌ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here