గుడిలోని దేవుడిని ఏమని ప్రార్ధించాలి… డెస్క్:దుర్గ

0
6
గుడిలోని దేవుడిని ఏమని ప్రార్ధించాలి…          డెస్క్:దుర్గ

మీరు గుడిలోనికి వెళ్లినపుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. “అనాయాసేన మరణం” నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు. “వినా ధైన్యేన జీవనం” నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని  ప్రసాదించు. “దేహంతే తన సాన్నిధ్యం” మృత్యువు నావద్దకు వచ్చినపుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.     
1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోని తీసుకు వెళ్ళు.
2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.   
3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నదిపించు. ఇలా ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.