గుర్రంతో చలాకి సవారి – టీజర్ టాక్ …

1
8
గుర్రంతో చలాకి సవారి – టీజర్ టాక్ …

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన టీం … 

            వివరాల్లోకి వెళితే…..నందు హీరోగా ప్రియాంక శర్మను హీరొయిన్ గా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం సవారి. కొద్దిరోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన టీం తాజాగా టీజర్ ని లాంచ్ చేసింది. లైట్ గా థీమ్ ని ఇందులో చూపించారు. అనగనగా బాద్షా అనే గుర్రం. దానికి అండగా తోడుగా స్నేహితుడిగా కాచుకునే ఉండే కాపరి రాజు(బాద్షా). అనుకోకుండా ఓ సందర్భంలో పెళ్లి నుంచి తప్పించుకుని వచ్చిన భాగి(ప్రియాంక శర్మ)తో నందుకి అతని గుర్రానికి స్నేహం ఏర్పడుతుంది.మరోవైపు భాగి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పాటు కాళి అనే రౌడీ గ్యాంగ్ వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇక అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. నందుకి భాగికి మధ్య ప్రేమ మొదలవుతుంది.ఈ కథకు గుర్రానికి సవారి మీద బ్రతికే రాజుకు రౌడీ గ్యాంగ్ తో క్లాష్ ఎందుకు వచ్చింది అనేదే కథలో కీలకమైన పాయింట్ 

1 COMMENT

Comments are closed.