‘అమ్మఒడి’ని సగం ముంచేసిన జగన్ ………

0
5
‘అమ్మఒడి’ని సగం ముంచేసిన జగన్ ………

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10) న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • అమ్మఒడిని ఆంక్షల బడి చేశారు
  • 80 లక్షల మందిని 43 లక్షలకు కుదించారు
  • జగన్ తీరు మాటలు ఘనం, కోతలు సగం
  • ట్విట్టర్ లో నారా లోకేశ్

                    వివరాల్లోకి వెళితే…అమ్మఒడి పథకం లబ్దిదారులను ముఖ్యమంత్రి జగన్, పలు షరతులు పెట్టి సగానికి సగం చేశారని మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. “జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి  అమ్మఒడి ఇవ్వాలి. కానీ అసెంబ్లీకి  వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలు.. అంటే సగానికి సగం చేశారు. మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు” అని ఆయన మండిపడ్డారు.