మన్మోహన్ కు అత్యున్నత స్థాయి సెక్యూరిటీ తొలగింపు

0
6
మన్మోహన్ కు అత్యున్నత స్థాయి సెక్యూరిటీ తొలగింపు

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • మన్మోహన్ కు ఎస్పీజీ సెక్యూరిటీ తొలగింపు
  • సీఆర్పీఎఫ్ భద్రత కిందకు మాజీ ప్రధాని
  • కొనసాగనున్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ

                                  వివరాల్లోకి వెళితే…ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు ఉన్న అత్యున్నత సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మరి కొందరి సెక్యూరిటీని తగ్గించింది. తాజాగా, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ… ఆయను ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్… తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.