భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం…

0
6
భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం…

హైదరాబాద్‌ నగరంలోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు మాదక ద్రవ్యాల సరఫరా అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. అక్రమంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నేరేడ్‌మెట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొకైన్‌, హెరాయిన్‌ తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ముఠా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి రహస్యంగా కొకైన్‌, హెరాయిన్‌ దిగుమతి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యక్తులకు సరఫరా చేస్తున్నారు. అరెస్టయిన నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.