తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం………..

0
3
తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం………..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……..

  • నేడు మరింత బలపడనున్న అల్ప పీడనం
  • నేడు అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం
  • వెల్లడించిన వాతావరణ శాఖ

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతం, దానిని అనుకుని ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. నేడు అల్పపీడనం మరింత బలపడవచ్చని, ఫలితంగా బుధవారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ కుంభవృష్టి పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.