కిసాన్ సాయం………

0
8
కిసాన్ సాయం………

 న్యూస్ టుడే న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తెచ్చిన పీ ఎం కిసాన్ పధకం నగదు సాయాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన(పీ ఎం కిసాన్) కింద ఐదెకరాల లోపు వ్యవసయభూమి వున్న రైతులకు ఏటా ఆరువేల రూపాయలు ఇస్తామని ఇటీవలే బడ్జెట్ సమావేశాల సందర్భముగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పధకం కింద పన్నెండు కోట్ల మంది లబ్ది పొందిన రైతులున్నారని రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ను ఈ ఆర్ధిక సంవత్సరంలో కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. ఈ పధకం గతేడాది డిసెంబర్ నుంచి వర్తించనున్నది. బడ్జెట్ కేటాయింపులకు కింద ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ. 20వేల కోట్లు కేటాయించారు.

                                                                                   డెస్క్: ఆర్. దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here