సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు……..

0
8
సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు……..

నారాయాణపేట:,కొండారెడ్డిపల్లి(వంగూరు), న్యూస్‌టుడే :

1)రైతు శిక్షణ కేంద్రం అధికారి కృపాకర్‌రెడ్డి……….
2)సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని ………
3)సేంద్రియ ఎరువులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం………..

 సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని మహబూబ్‌నగర్‌ రైతు శిక్షణ కేంద్రం అధికారి కృపాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో రైతులకు సేంద్రియ ఎరువులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మాట్లాడారు. రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పి, సేంద్రియ ఎరువులను వాడితే మంచి లాభాలు వస్తాయని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు తీసుకొని విత్తుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచి భారœమ్మ, ఉప సర్పంచి వేమారెడ్డి, ఏవోలు తనుజారాజ్‌, ప్రత్యూష, ఏఈవోలు ప్రేమ్‌కుమార్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

డెస్క్:గౌస్&  లక్ష్మణ్