‘చారిత్రక తీర్పు’… అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన

0
0
‘చారిత్రక తీర్పు’… అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలి
  • తీర్పును అందరూ స్వాగతించాలి
  • ఈ విషయంపై మరో వివాదం ఉండరాదు

                                 వివరాల్లోకి వెళితే…అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిందని, భారత సామాజిక నిర్మాణానికి ఈ తీర్పు మరింత బలాన్నిస్తోందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ తీర్పును సమదృష్టితో చూడాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. ఓ మైలురాయి వంటి ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరున్నట్లు వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ… ‘ఈ తీర్పును అందరూ స్వాగతించాలి.. ఇలా చేస్తేనే దేశంలో సామాజిక సామరస్యం వర్థిల్లుతుంది. ఈ విషయంపై మరో వివాదం ఉండరాదని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.