విశాఖ జిల్లాలో కూలిపోయిన చారిత్రక స్థూపం……

0
4
విశాఖ జిల్లాలో కూలిపోయిన చారిత్రక స్థూపం……

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని తొట్లకొండపై మహాస్థూపం
  • భారీ వర్షాలకు కుప్పకూలిన సగ భాగం
  • ఇటీవలే పునర్నిర్మాణ పనులను చేపట్టిన పురావస్తు శాఖ

విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ చారిత్రక కట్టడం కుప్పకూలింది. విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులో తొట్లకొండపై ఉన్న మహాస్థూపం సగ భాగం కూలిపోయింది. ఈ స్థూపానికి ఎంతో చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో దీన్ని నిర్మించారు. పూర్తిగా ఇటుకలతో దీన్ని నిర్మించడం విశేషం. మరోవైపు, ఈ స్థూపం పునర్నిర్మాణ పనుల కోసం పురావస్తు శాఖ ఇటీవలే రూ. 3.4 కోట్లతో పనులు చేపట్టింది. ఇంతలోనే ఇలా జరగడం అందరినీ బాధిస్తోంది.