హాకీ టోర్నీ లో భారత్ …

0
9
హాకీ టోర్నీ లో భారత్  …

లాసాన్నె న్యూస్ టుడే: భారత్‌ మరోసారి ప్రపంచ కప్‌ హాకీ టోర్నీని నిర్వహిం చేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిం ది. మంగళవారం భారత హాకీ సమాఖ్య ఇందు కోసం బిడ్‌ను కూడా దాఖ లు చేసింది. 2018లో భారత్‌, పురుషుల ప్రపంచ కప్‌ను ఒడిశాలో నిర్వహిం చిన విషయం తెలిసిందే. తాజాగా వచ్చే మహిళల లేదా పురుషు ప్రపంచకప్‌ను 2023 లో జనవరి 13 నుంచి 29 వరకు నిర్వహించేం దుకు సంసిద్ధతను తెలి పింది. కాగా ఇదే రీతిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కాగా స్పెయిన్‌, మలేసియా, జర్మనీలు ఈ ఈవెంట్‌ను 2022 జూలై 1 నుం చి 17వరకు నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒక ప్రకటన చేస్తూ.. వచ్చే వరల్డ్‌ కప్‌ నిర్వహణకోసం పలు బిడ్డింగ్‌లు వచ్చాయి. బిడ్డింగ్‌ల దాఖలుకు ఆఖరు తేదీ జనవరి 31తో ముగి సింది. ఆయదె శాలు రెండు షెడ్యూల్‌ తేదీలను తమ బిడ్డిం గ్‌లో పేర్కొన్నాయి. 2022 జులై 1నుం చి 17 లేదా 2023 జనవరి 13 నుంచి 29లకు ప్రాధా న్యతనిచ్చాయని పేర్కొంది. ఈ బిడ్డిం గ్‌లను ఎఫ్‌ఐహెచ్‌ పరిశీలించి తుది నిర్ణయం జూన్‌ నెల లో తీసుకుంటుం ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here