హైదరాబాదులో హానీ ట్రాప్.. వ్యాపారవేత్తను ముంచేసి మరో ఎన్నారైను టార్గెట్ చేసిన ఎయిర్ హోస్టెస్…….

0
0
హైదరాబాదులో హానీ ట్రాప్.. వ్యాపారవేత్తను ముంచేసి మరో ఎన్నారైను టార్గెట్ చేసిన ఎయిర్ హోస్టెస్…….

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • హనీట్రాప్ కు పాల్పడుతున్న ఎయిర్ హోస్టెస్ కనిష్క
  • ప్రాణభయంతో రూ. 20 లక్షలు సమర్పించుకున్న బాధితుడు
  • కనిష్కకు సహకరిస్తున్న ఆమె భర్త

హైదరాబాదులో మరో హానీట్రాప్ భాగోతం వెలుగుచూసింది. తన అందచందాలతో ఓ వ్యాపారవేత్తను ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న కనిష్క బుట్టలో పడేసింది. సదరు వ్యాపారవేత్తతో రాసలీలల దృశ్యాలను సీక్రెట్ గా చిత్రీకరించి, ఆయనను బ్లాక్ మెయిల్ చేసింది. ఈ వ్యవహారంలో ఆమె భర్త ఆమెకు సహకరించడం పెద్ద ట్విస్ట్. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఆయనను ఓ రిసార్ట్ కు పిలిపించి, తుపాకీతో బెదిరించారు. ప్రాణభయంతో బాధితుడు వారికి రూ. 20 లక్షలను సమర్పించుకున్నాడు. అంతేకాదు, అతనితో మరో రూ. కోటికి బాండ్ కూడా వీరు రాయించుకున్నారు. ఈ వ్యవహారంపై సదరు వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కనిష్కతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్న సమయంలో… భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ ఎన్నారైని కూడా టార్గెట్ చేసిన విషయం వెలుగుచూసింది.