డేరాబాబా ఆశ్రమానికి వచ్చిన హనీప్రీత్ సింగ్…….

0
0
డేరాబాబా ఆశ్రమానికి వచ్చిన హనీప్రీత్ సింగ్…….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • బెయిల్ పై నిన్న విడుదలైన హనీప్రీత్
  • నిన్న అర్ధరాత్రి డేరాసచ్చాసౌదాకు చేరుకున్న హనీప్రీత్
  • ఘన స్వాగతం పలికిన వేలాది మంది భక్తులు

డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కు నిన్న బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆమెపై ఉన్న దేశద్రోహ ఆరోపణలు కొట్టేసిన పంచకుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, గత రెండేళ్లుగా అంబాలా సెంట్రల్ జైల్లో ఉన్న హనీప్రీత్ విడుదలయ్యారు.బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె నిన్న అర్ధరాత్రి నేరుగా సిర్సాలోని డేరాసచ్చాసౌదాకు వచ్చారు. ఈ సందర్భంగా డేరాలో వేచి చూస్తున్న వేలాది మంది భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, ఈ సందర్భంగా తన కోసం వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మీడియాతో మాట్లాడకుండానే రామ్ రహీం నివాసం ఉండే క్వార్టర్ కు కారులో వెళ్లిపోయారు.