చికెన్ హాట్ అండ్ సోర్

0
9
చికెన్ హాట్ అండ్ సోర్

కావలసిన పదార్థాలు :

 • క్యాబేజి
 • క్యారెట్ (తరుగు) – ఒక్కోటి అర కప్పు చొప్పున
 • ఫ్రెంచ్ బీన్స్
 • మష్రూమ్స్ (ముక్కలు) – పావు కప్పు చొప్పున
 • ఉల్లికాడలు (ముక్కలు) – అర కప్పు
 • చికెన్ ఉడికించిన నీళ్లు – మూడు కప్పులు
 • సోయాసాస్
 • రెడ్ చిల్లీ సాస్
 • వెనిగర్ – ఒక్కో టేబుల్ స్పూన్
 • మిరియాల పొడి – అర టీస్పూన్
 • అజినామోటో – పావు టీస్పూన్
 • చికెన్ ముక్కలు (ఉడికించి) – అర కప్పు
 • మొక్కజొన్న పిండి – మూడు టేబుల్ స్పూన్లు
 • ఉప్పు – రుచికి సరిపడా
 • మొక్కజొన్నపిండి – ఒక టీస్పూన్.

తయారుచేసే పద్ధతి : నూనె వేడిచేసి కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి. తరువాత చికెన్ ఉడికించిన నీళ్లు, సరిపడినన్ని నీళ్లు, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాలపొడి, అజినామోటో, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి. ఆ తరువాత స్టవ్ మంట తగ్గించి మొక్కజొన్నపిండి పేస్ట్ కలిపి సూప్ చిక్కబడేవరకు గరిటెతో కలపాలి. ఐదు నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేసి ఉల్లికాడలతో అలంకరించాలి. జు గుడ్డు కలపాలనుకుంటే సూప్ ఉడకడం మొదలయ్యాక మొక్కజొన్న పిండి కలపకముందే గుడ్డును వేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here