త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాను: హీరోయిన్ లైలా

0
3
త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాను: హీరోయిన్ లైలా

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం 
  • తరువాత స్థానం తమిళ ఇండస్ట్రీకి ఇస్తాను 
  • సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నానన్న లైలా

                                    వివరాల్లోకి వెళితే…తెలుగు తెరకి ‘ఎగిరే పావురమా’ సినిమా ద్వారా పరిచయమైన లైలా, ఆ తరువాత ‘ఉగాది’ .. ‘ఖైదీగారు’ .. ‘పెళ్లిచేసుకుందాం’ .. ‘పవిత్రప్రేమ’ వంటి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని 50 సినిమాల వరకు చేసింది.
తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ .. “తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరువాత నేను తమిళ చిత్రపరిశ్రమకి ఎక్కువ మార్కులు ఇస్తాను. ఈ రెండు భాషల్లోను నాకు మంచి ప్రోత్సాహం లభించింది. అందువల్లనే త్వరలో ఈ రెండు భాషల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాను. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో పనిచేయలేకపోయిన దర్శకులతోను కలిసి పనిచేయాలని వుంది” అని ఆమె చెప్పుకొచ్చింది.