ఏ ప్రాంతం వాళ్లు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడంలేదు……….

0
8
ఏ ప్రాంతం వాళ్లు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడంలేదు……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • ‘సాహో’ ప్రమోషన్ ఈవెంట్లతో ప్రభాస్ బిజీ
  • ‘సాహో’ విషయంలో భయం కలుగుతోందని వ్యాఖ్యలు
  • నిద్రలేని రాత్రులు గడిపానన్న ప్రభాస్

ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘సాహో’ ఆగస్టు 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాహుబలి’ కారణంగా తన ఇమేజ్ విషయంలో ఒత్తిడి బాగా పెరిగిందని, ఇప్పుడు ‘సాహో’ విషయంలో చాలా భయంగా ఉందని తెలిపాడు.గుజరాత్ లో చాలాచోట్ల పిల్లలు ‘బాహుబలి’ పాటలు పాడుకుంటున్నారని ఓ ఫ్రెండ్ చెబితే ఆశ్చర్యం కలిగిందని, ప్రత్యేకంగా తనను ఏ ప్రాంతం వాసులు ఇష్టపడుతున్నారో తెలియకుండా ఉందని అన్నాడు. అన్ని ప్రాంతాల వారి అభిమానం ఓ రకంగా తనను ఒత్తిడికి గురిచేస్తోందని, ‘సాహో’ విషయంలో నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపానని ప్రభాస్ వెల్లడించాడు. ”బాహుబలి’తో గుర్తింపు వచ్చింది కానీ స్వేచ్ఛను కోల్పోయానని పేర్కొన్నాడు. ఇకమీదట భారీ బడ్జెట్ చిత్రాల్లో చేయాలనుకోవడంలేదని, భారీ బడ్జెట్ కారణంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయాడు.