నాకు ఇంత కావాలని నేనెప్పుడూ అడగలేదు………

0
7
నాకు ఇంత కావాలని నేనెప్పుడూ అడగలేదు………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • ఇండస్ట్రీలో పెద్దల ఆదరణ వుంది 
  • అభిమానించే ప్రేక్షకులు వున్నారు 
  • ఆ నిర్మాత నా దృష్టిలో దేవుడు  

తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా సంపూర్ణేశ్ బాబుకి మంచి క్రేజ్ వుంది. సినిమా .. సినిమాకి గ్యాప్ వున్నా, ఫ్లాపులు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని తాజాగా వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కూడా నిరూపించింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ .. “ఇండస్ట్రీలోని పెద్ద హీరోలంతా నన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఎక్కడ కలిసినా నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్లందరి ఆదరాభిమానాలతోనే నేను నిలబడిగలిగాను. ఇక నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నిర్మాత సాయి రాజేశ్ గారు .. నా దృష్టిలో ఆయన దేవుడు. ఆయన నాకు అందించిన సహాయ సహకారాలను ఒక్క మాటలో చెప్పలేను. మొదటి సినిమాకి నేను తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. ఆ తరువాత కూడా ఇంత ఇస్తేనే చేస్తా అని ఎవరితోను అనలేదు .. ఇంత ఇవ్వండి అని అడగలేదు. పారితోషికం విషయంలో పట్టుబట్టడం లేదు గనుకనే నా ప్రయాణం ఇంతవరకూ సాగింది” అని చెప్పుకొచ్చాడు.