ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ!

0
5
ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ!

అనంతపురం జిల్లా:(టిన్యూస్10):న్యూస్‌టుడే 

  • అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి పరామర్శ
  • ప్రసంగంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు      

                        వివరాల్లోకి వెళితే…. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ అంగీకరించబోరని, తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న చంద్రబాబు, అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. “మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలి. సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అంటున్నారు.