జయసుధగారు అలా అనడంతో నేను ఆశ్చర్యపోయాను: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

0
4
జయసుధగారు అలా అనడంతో నేను ఆశ్చర్యపోయాను: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • జయసుధగారు షూటింగులో ఉండగా కలిశాను 
  • ఆమె డైలాగ్స్ చదువుకునేవారు కాదు 
  • తన డైలాగ్స్ చిన్నవిగా రాయించుకునేవారన్న ఈశ్వర్

                                            వివరాల్లోకి వెళితే…రచయితగా .. సీనియర్ జర్నలిస్ట్ గా బీకే ఈశ్వర్ గారికి మంచి పేరు వుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ, జయసుధను గురించి ప్రస్తావించారు. “ఒకసారి జయసుధగారు ఒక సినిమా షూటింగులో ఉండగా నేను వెళ్లాను. అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ పేపర్ తీసుకురాగానే డైలాగ్స్ చదివి వినిపించమని జయసుధ గారు అన్నారు. ‘డైలాగ్స్ ను మీరు చదువుకోవచ్చు గదండీ’ అన్నాను నేను. ‘నాకు తెలుగు సరిగా రాదు కదండీ’ అని ఆమె చాలా నిర్మొహమాటంగా చెప్పారు. నిజానికి ఆమె తాతగారు నిడదవోలు వెంకట్రావుగారు తెలుగులో పెద్ద భాషా వేత్త. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జయసుధగారు అలా అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చెన్నైలోనే జయసుధగారు పుట్టి పెరగడం వలన .. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వలన జయసుధగారికి తెలుగు సరిగ్గా రాలేదనే విషయం అర్థమైంది. అందువల్లనే తను చెప్పాల్సిన డైలాగ్స్ ను చిన్నవిగా మార్పించుకునేవారు. సన్నివేశాన్ని అర్థం చేసుకుని కెమెరా ముందుకు వచ్చి పాత్రలో జీవించేవారు. తెలుగు సరిగ్గా చదవడం రాకపోయినా ఆమె డైలాగ్ చెప్పే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను” అని చెప్పుకొచ్చారు.