యజమానురాలి ఐడియా.. పనిమనిషి జీవితాన్ని మార్చేసింది!

0
2
యజమానురాలి ఐడియా.. పనిమనిషి జీవితాన్ని మార్చేసింది!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • తన ఇంట్లోని పనిమనిషి కోసం బిజినెస్ కార్డు రూపొందించిన ధనశ్రీ 
  • వీరి గాధను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన మరో మహిళ
  • దేశం నలుమూలల నుంచి పని ఇస్తామంటూ ఫోన్లు

పని కోల్పోయిన ఓ మహిళ దిగాలుగా ఉంటే చూసిన ఓ యజమానురాలు.. తనకొచ్చిన చిన్నపాటి ఆలోచనను అమలు చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు వీరిద్దరి విజయగాధ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంతకీ ఏమైందంటే.. పూణేకు చెందిన ధనశ్రీ షిండే బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో సీనియర్ మేనేజర్. ఆమె ఇంట్లో గీతా కాలె అనే మహిళ పనిచేస్తోంది. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ధనశ్రీ.. గీత దిగాలుగా ఉండడం చూసి విషయం ఆరా తీసింది.ఓ యజమాని తనను పని నుంచి తీసేశారని, ఈ కారణంగా తన ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చెప్పింది విన్న తర్వాత ధనశ్రీలో చటుక్కున ఓ ఆలోచన మెరిసింది. వెంటనే గీత కోసం ఓ బిజినెస్ కార్డు తయారుచేసింది. ‘గీతా కాలె, ఇంటిపని సహాయకురాలు, బావ్దాన్’ పేరుతో వంద కార్డులు ప్రింట్ చేయించింది. అందులో గీత చేసే ఒక్కో పనికి ఎంతమొత్తం తీసుకుంటుందన్న విషయాలను కూడా ముద్రించింది. ఆ కార్డులను ఓ వ్యక్తి సాయంతో తమ కాలనీలో అందరికీ పంపిణీ చేయించింది.