దేవీపట్నం వద్ద మరో ఐదు మృతదేహాల గుర్తింపు… 31కి చేరిన మృతుల సంఖ్య……..

0
4
దేవీపట్నం వద్ద మరో ఐదు మృతదేహాల గుర్తింపు… 31కి చేరిన మృతుల సంఖ్య……..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…….

  • కచ్చులూరు వద్ద గోదావరిలో పడవ మునక…
  • 39 మంది గల్లంతు….
  • తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటన…

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది.