జబర్దస్త్’ అంటే నాకెంతో ఇష్టం..వదిలేదు లేదు …

0
5
జబర్దస్త్’ అంటే నాకెంతో ఇష్టం..వదిలేదు లేదు …
‘జనసేన’ పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. ఇక రాజాకీలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్’ చేయకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. ‘జబర్దస్త్’ అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే .. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు” అని చెప్పుకొచ్చారు.

                                                                                                             డెస్క్:కోటి