మలేసియా, టర్కీ ప్రధానులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్…….

0
9
మలేసియా, టర్కీ ప్రధానులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్…….

జమ్ముకశ్మీర్:(టిన్యూస్10) న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ఆర్టికల్ 370 రద్దుపై మండిపడుతున్న పాకిస్థాన్
  • నేడు అత్యవసరంగా సమావేశమవుతున్న పాక్ పార్లమెంటు
  • జమ్ముకశ్మీర్ అంశాలపై చర్చించనున్న నేతలు

                       వివరాల్లోకి వెళితే…జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కశ్మీరీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు ఉభయసభలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నాయి. జమ్ముకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, భారత్ నిర్ణయాలపై మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారికి ఇమ్రాన్ తెలిపారు. ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉందని అన్నారు. అయితే, కశ్మీరీల కోసం విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తామని… దౌత్యపరంగా పోరాడుతామని చెప్పారు.