కుప్పంలో బాబు చేసిందేమి లేదు…9ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం..

0
3
కుప్పంలో బాబు చేసిందేమి లేదు…9ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం..

 చిత్తూరు జిల్లా న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ…చంద్రబాబు ప్రభుత్వంపై మండి పడ్డారు.  కుప్పంలో ప్రభుత్వం తరపునా చేసినది ఏమీ కనిపించలేదని అన్నారు.కుప్పంలో ప్రైవేట్ మార్కెట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కనిపిస్తున్నాయని, 9ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పంలో కేవలం 18వేల ఇళ్లే కట్టించారని అన్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ప్రాథమిక విద్య లేదని మండి పడ్డారు.కుప్పంలో ప్రజలు పడుతున్న బాధలను చూశానని వైఎస్ జగన్ అన్నారు.ఆరోగ్యశ్రీని బాబు నీరుగార్చారన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ది  చెందిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.