ఉత్తమస్థానం లో ర్యాంక్ సాధించిన భారత మహిళా బ్యాట్స్‌మెన్…..

0
12
ఉత్తమస్థానం లో ర్యాంక్ సాధించిన భారత మహిళా బ్యాట్స్‌మెన్…..

1.భారత మహిళ టీ20 లో ఉత్తమ ర్యాంక్
2.టీ20 ర్యాంకులు వదిలిన ఐసీసి

భారత మహిళా జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన టీ20ల్లో తన కెరియర్‌ ఉత్తమ ర్యాంకును పొందింది. ఐసీసీ ఆదివారం విడుదల చేసిన టీ20 మహిళా క్రీడాకారిణుల ర్యాంకుల్లో మంధాన మూడో స్థానంలో నిలిచింది. వన్డేల్లో ఇప్పటికే టాప్‌లో నిలిచిన మంధాన ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన పొట్టి సిరీస్‌లో 72 పరుగులు చేసింది. మూడో మ్యాచ్‌లో ఒక అర్ధ సెంచరీ నమోదు చేసింది. కాగా టీ20 జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కాలి చీలమండ గాయంతో ఈ సిరీస్‌లో ఆడలేకపోవటంతో ఐసీసీ ర్యాంకుల్లో రెండు స్థానాలు దిగజారి తొమ్మదో స్థానంలో ఉంది. బ్యాటింగ్‌ జాబితాలో టాప్‌లో న్యూజిలాండకు చెందిన సూజి బేట్స్‌ ఉంది.
డెస్క్:రెడ్డి