ధోనీకిదే చివరిదా?

0
5
ధోనీకిదే చివరిదా?

 (టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • అభిమానుల్లో ఉత్కంఠ….
  • ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం… 

                     వివరాల్లోకి వెళితే…..తాజా ప్రపంచకప్‌తోనే ధోని అంతర్జాతీయ కెరీర్‌ ముగుస్తుందన్నది అంచనా! 38 ఏళ్ల ధోని.. ఈ టోర్నీ కోసమే ఇంకా జట్టులో ఉన్నాడు! మరో కప్పు గెలిపించి మహి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆశించారు అభిమానులు. కానీ సెమీస్‌తో భారత్‌ కథ ముగిసింది. ధోని ఇంకా ఏమీ చెప్పలేదు కానీ.. రిటైర్మెంట్‌ ప్రకటించడం లాంఛనమే కావచ్చు. కాబట్టి ఇదే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావచ్చు. మ్యాచ్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ గురించి కోహ్లిని విలేకరులు అడిగితే.. తమకు అతనేమీ చెప్పలేదని అన్నాడు. కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ ఆసాంతం బాగా ఆడినా.. కేవలం ఓ 45 నిమిషాల పేలవ ఆట కారణంగా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించడం చాలా బాధ కలిగిస్తోంది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. న్యూజిలాండ్‌ బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా ఛేదనలో తొలి అరగంటలో వాళ్లు చేసిన బౌలింగే మ్యాచ్‌ ఫలితంలో కీలకమైంది. జడేజా అద్భుతంగా ఆడాడు.