అది ఉత్తుత్తి హామీనా? కోర్టుకు అబద్ధం చెప్పారా?

0
4
అది ఉత్తుత్తి హామీనా? కోర్టుకు అబద్ధం చెప్పారా?

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ అమలు కాదు
  • హైకోర్టులో ప్రభుత్వ వాదన చూస్తేనే తెలుస్తోంది
  • ప్రభుత్వం వేసిన గుగ్లీతో దొరికిపోయిన కేసీఆర్
  • ఫేస్ బుక్ లో విజయశాంతి విమర్శలు

“ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టిఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనను చూస్తుంటే, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారిచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోంది” అని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హుజూర్ నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉత్తుత్తివా? లేక కోర్టుకు అవాస్తవాలు చెప్పారా? అని ఆమె ప్రశ్నించారు.“తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనడం ఇందుకు నిదర్శనం. హైకోర్టు ఈ వివరణకు కౌంటర్ ప్రశ్న వేస్తూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి 47 కోట్ల రూపాయలు లేనప్పుడు హుజూర్‌ నగర్‌ లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కెసిఆర్ గారు ఎలా ప్రకటించారని నిలదీసింది.