50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ‘ఇస్మార్ట్ శంకర్’

0
7
50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ‘ఇస్మార్ట్ శంకర్’

 

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • ఇటీవలే థియేటర్స్ కి వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’…
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు …
  • మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం…  

                                      వివరాల్లోకి వెళితే….రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 18వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
6 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పూరి మాస్ డైలాగులు .. రామ్ నటన – డాన్స్ .. మణిశర్మ మాస్ బీట్స్ .. నభా – నిధి గ్లామర్ ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లకు వచ్చేవరకూ, ‘ఇస్మార్ట్ శంకర్’ కి తిరుగులేదు. అందువలన వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.