గుడ్లను ఉడికిస్తున్నారు సరే.. కానీ ఎలా?

0
4
గుడ్లను ఉడికిస్తున్నారు సరే.. కానీ ఎలా?

 ఉడకబెట్టిన గుడ్లు సరిగ్గా ఉడకాయా.. లేదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో చూద్దాం…
సాధారణంగా కొంతమంది మెత్తగా ఉడికిన గుడ్లను ఇష్టపడితే.. మరికొంతమంది గట్టిగా ఉడికిన గుడ్లను సేవించడానికి ఇష్టపడతారు. అంటే.. వ్యక్తిగత అభిరుచులను బట్టి వుంటాయి. కాబట్టి.. ఆ రెండు విధానాలకు సంబంధించి గుడ్డు ఎలా వుంటుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుంటే మంచిది.
మెత్తగా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో.. తెల్లసొన మెత్తగా వుండి కదులుతున్న పచ్చసొనను కావాలంటే తక్కువ సేపు ఉడకాలి. అలాగే కుదురుకున్న తెల్ల సొన, కొద్దిగా కుదురుకున్న పచ్చ సొన కావాలంటే ఎక్కువ సేపు ఉడకాలి. ఏదైనా ప్రత్యెక వంటకం కోసం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు గుడ్ల లోని పచ్చ సొన మధ్యలోనే ఉండాలనుకుంటే గుడ్లను ముందు నుంచే చల్లటి నీటిలో వేసి మెల్లిగా ఉడకనివ్వాలి. ఇలా జరుగుతుండగా ఒక చెక్క స్పూన్ తో దాన్ని పూర్తిగా ఉడికేదాకా మధ్యమధ్యలో కదపాలి. ఇలా కాకుండా తీవ్రమైన వేడి నీటి లో ఉడికిస్తే గుడ్లు రబ్బర్ లాగా సాగి, గట్టిగా మారిపోతాయి.