ఇవేమి చదువులురా బాబోయ్…

0
5
ఇవేమి చదువులురా బాబోయ్…

గుంటూరు న్యూస్ టూడే:సత్తేనపల్లి .. టెన్త్ విద్యార్ధులు అర్ధాకలితో అల్లాడుతున్నారు.పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.ఉదయం బడికి బయల్దేరే పిల్లలు స్కూలులో మధ్యాహ్నం భోజనం మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం వదలగానే అర్ధాకలితో ప్రత్యేక తరగతుల్లో కూర్చుంటున్నారు.మళ్ళీ ఇంటికి వెళితేనే నోట్లోకి ముద్ద దిగేది .వారికి ఆహార విషయమై విద్యాశాఖ నుంచి నేటివరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు .ఏటా జిల్లా పరిషత్ నుంచి కేటాయింపులు చేసేవారు .ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడి లో పట్టించుకోక పోవడంతో జిల్లా లోని టెన్త్ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు . జిల్లా వ్యాప్తంగా 59 వేల మంది టెన్త్ విద్యార్ధులు ఉంటే వీరిలో సగం మంది జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన వారే ఉన్నారు. కష్టపడి చదువుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశంగా భావించి మన రాష్ట్రాన్ని ,చైతన్యపరిచే విదానంతోనే చదివిస్తున్నామని ఉపాధ్యాయులు పిల్లలకు వివరించారు .

                                                                                                          డెస్క్:కోటి&సాయి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here