జగన్మోహన్‌రెడ్డికి ఓటమి భయం……..

0
10
జగన్మోహన్‌రెడ్డికి ఓటమి భయం……..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఎలాగైనా దక్కించుకోవాలనే తపనతోనే ప్రశాంత్‌ కిషోర్‌ మార్గదర్శనంలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారని.. తమ నైజం బయటపడుతోందనే భయంతోనే తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగిస్తోందనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. అనంతరం కూడలిలో నాయకులు, కార్యకర్తలు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జగన్మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు.

 

                                                                                                                   డెస్క్:గౌస్