జంపింగ్ తమ్ముళ్లకు చురకేసిన కేశినేని!

0
4
జంపింగ్ తమ్ముళ్లకు చురకేసిన కేశినేని!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్టు…..
  • ఏపీని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళుతున్నట్లుగా బిల్డప్…. 

  విజయవాడ ఎంపీగా రెండోసారి గెలిచిన నాటి నుంచి కేశినేని నాని తీరు మారింది. గతానికి భిన్నంగా ఆయన సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా మారారు. పార్టీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా కొన్ని పోస్టులు పెట్టటం ద్వారా ఆయన ఒక్కసారిగా అందరి నోట్లో నానారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లకు చురకలు వేస్తూ ఆయన వ్యంగ్యస్త్రాల్ని సంధించారు.ఏపీని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన జంపింగ్ నేతల అసలు రంగేమిటో తాజా బడ్జెట్ చూస్తే అర్థమైందన్నారు. మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ..  ఈ రాష్ట్రాన్ని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవటానికి చేరారో అర్థమైందని పోస్టు పెట్టారు.