50 ఏళ్ల వయస్సులో జెన్నిఫర్‌ వెడ్డింగ్….

0
10
50 ఏళ్ల వయస్సులో జెన్నిఫర్‌ వెడ్డింగ్….
హాలీవుడ్‌ నటి, గాయని, నిర్మాత జెన్నిఫర్‌ లోపెజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. 50 ఏళ్ల వయసు కలిగిన జెన్నిఫర్‌కు ఇది నాలుగో పెళ్లి. బేస్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు అలెక్స్‌ రోడ్రిగ్జ్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అలెక్స్‌ లోపెజ్‌ చేతికి తొడిగిన వజ్రపు ఉంగరం ఫొటోను పోస్ట్‌ చేశారు. జెన్నిఫర్‌ కంటే అలెక్స్‌ ఆరేళ్లు చిన్నావాడు. రెండేళ్లుగా వీర్దిరూ డేటింగ్‌లో ఉన్నారు. లోపెజ్‌ పదకొండేళ్ల కవల పిల్లలకు తల్లి. అలెక్స్‌కు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని వీరిద్దరూ వెల్లడించలేదు.
                                                                                                                  డెస్క్:జ్యోతి