సినీ తారలకు కానుకగా దోచుకున్న నగలు…..

0
2
సినీ తారలకు కానుకగా దోచుకున్న నగలు…..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన నిందితుడు
  • నిధుల లేమితో మధ్యలోనే ఆగిన ముఠా నాయకుడి సినిమాలు
  • మురుగన్‌కు తారలతో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా

తిరుచ్చిలోని లలిత జువెలరీ షోరూమ్‌ను దోచేసిన నిందితుల్లో ఒకరైన సురేశ్ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. ఈ దోపిడీ ముఠా నాయకుడు మురుగన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న విషయం గతంలోనే బయపడింది. కాగా, గతంలో పలు దోపిడీల్లో దోచుకున్న నగల్లో కొన్నింటిని సినీ తారలకు కానుకగా ఇచ్చినట్టు సురేశ్ వెల్లడించాడు. అతడిచ్చిన వివరాలతో మురుగున్‌కు సినీ తారలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కాగా, మురుగన్ 2013లో ‘ఆత్మ’ అనే సినిమాను ప్రారంభించాడు. అయితే, నిధుల లేమి కారణంగా అది మధ్యలోనే అటకెక్కింది. ఆ తర్వాత  ‘మానస’ పేరుతో మరో సినిమాను ప్రారంభించాడు. ఇందుకోసం ఓ ప్రముఖ నటికి కొంత అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.